గ్రేటర్ వరంగల్ 27వ డివిజన్ రంగంపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నాయిని

కాంగ్రెస్ భవన్ – 26-01-2021..

..

72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 27వ డివిజన్ రంగంపేటలో వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పిల్లలకు నోట్ బుక్స్ పంపిణి చేసారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..

భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 రోజున గౌరవంగా జరుపు కుంటారు

నేటి యువత ప్రజలు దేశ సేవతో పటు దేశ భక్తిని కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం అందించిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరు పాటించాలి.

కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేసిందని జవహర్లాల్ నెహ్రు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబాలు దేశం కోసం అహర్నిశలు శ్రమించేవారని వారి బాటలు మనం నడిచి దేశాభి వృద్ధికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాటుపడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, డివిజన్ అద్యక్షులు జి. సంగీత్ కుమార్, నగర కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై. భాస్కర్, ఎం.డి. సమద్, టి.పి.సి.సి. మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రాహత్ పర్వీన్, ఎం.డి అజ్గర్, నాయకులు అమన్, రబ్బాని, గన్నారపు కమల్, శివ, ప్రవీణ్, గోవింద్ అభిలాష్, అయేషా ఫాతిమా, ఎం.ది. జమీరుద్దిన్, సురేందర్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.