యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయి-యోగా గురువులు
స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం
నాన్న బొజ్జపల్లి రాజయ్య స్పూర్తితో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా -ట్రస్ట్ చైర్మన్ బొజ్జపల్లి సుభాష్
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ జూన్21
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఘనపూర్ మండలంలోని శివునిపల్లి గ్రామం జయ ఫంక్షన్ హాల్ లో యోగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథులుగ యోగ గురువులు స్వామి మహేశ్వరానంద మరియు శ్రీ రామ నారాయణ స్వామిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన వెలిగించి యోగ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య తనయుడు,ట్రస్ట్ చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ మాట్లాడుతూ మా నాన్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవ చేశారు.మా నాన్న స్ఫూర్తితో నియోజకవర్గ ప్రజలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు అనేకమైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.యోగ గురువులు స్వామి మహేశ్వరానంద మరియు శ్రీ రామ నారాయణ స్వామి మాట్లాడుతూ యోగ వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయని యోగ అభ్యాసం చేయడం వల్ల మనశ్శాంతి మరియు ఇంద్రియాలను నిగ్రహం చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించాలని పతంజలి మహర్షి యోగా విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం గురువులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్,భజరంగ్‌దళ్,బిజెపి జిల్లా మండల నాయకులు కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.