ఈ69న్యూస్ పాలకుర్తి జులై 24

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు,బ్రెడ్ లు పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఏకైక నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో,వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ మీడియా మరియు యువజన నాయకులు జోగు కుమార్,కొడం సాయిరాం, వంగాల అశోక్,నవీన్, కృష్ణ,భాస్కర్,రాజు,గణేష్, అరుణ్ కుమార్,వంగాల శ్రీకాంత్,ఏళ్ల స్వామి,దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.