జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో కలియుగ ఇలవేల్పు అయిన శ్రీ లక్ష్మీనృసింహస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు,బ్రహ్మోత్సవ కార్యక్రమలలో భాగంగా సోమవారం రోజున నిత్యవిధి పూజలతో మొదలై ఉ. 12-00 గం. లకు ధృజారోహనము (గరుడ ముద్ద),తదుపరి అరగింపు కార్యక్రమాలు జరిగినవి.సాయంత్రం 6-00 గంటలకు అశ్వవాహన సేవ, పల్లకి సేవ, సా. 7-00 ఎదురుకొళ్ళు, శ్రీ స్వామివారి కళ్యాణం(తలంబ్రాలు) జరుగతాయని ఆలయ చైర్మన్, కార్యనిర్వహణ అధికారి తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆలయ ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ హింగే మహేందర్ తెలిపారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆర్టీసి అధికారులు, విద్యుత్ అధికారులు, ఆర్ డ్యబ్లు ఎస్ అధికారులు,గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేసి భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పించారు. రేగొండ పిహెచుసి వైద్యురాలు మమతా ఆధ్వర్యంలో భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి భయం లేకుండా పోలీసులు బందోబస్త్ కొనసాగుతుందని రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్న పోలీస్ వారిని కానీ, ఆలయ సిబ్బందిని కానీ సంప్రదించాలని తెలిపారు.
