ఘనంగా డాక్టర్ బి.అర్.అంబేత్కర్ 64 వ వర్ధంతి


అంబే డ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో అంబేత్కర్ గారి వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అంబేత్కర్ 64 వ వర్ధంతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేత్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అని దళిత కుటుంబం లో పుట్టిన అంబేడ్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అని ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది గా ఆర్ధిక శాస్త్రవేత్త, రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా ఇతను దళితుల పై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి మరియు భారత రాజ్యాంగ శిల్పి. ఉన్నత విద్య కోసం కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించా డు
అని న్యాయ, సామాజిక, ఆర్ధిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్ధికవేత్త గా పని చేశాడు. తరువాత భారత్ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారత దేశ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు.అని సీతక్క గారు అన్నారు
1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారత్ దేశ చరిత్ర లో చీరస్మరనియంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశాల కృషికి తన పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు అని సీతక్క గారు కొనియాడారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి గారు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మాజీ సహకార సంఘం చైర్మన్ కునురి అశోక్ గౌడ్,

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.