|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

ఈ69 వార్త జఫర్ ఘడ్/ఏప్రిల్/04
జఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో ని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో1997-98 ఏడవ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం తాము చదువుకున్న పాఠశాలలో ఒక్కటై కలుసుకున్నారు.వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో స్నేహితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గడిపారు.పోటా పోటీగా ఫొటోలు,సెల్ఫీలు తీసుకుని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.ఉపాధ్యాయులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులను చూసి గర్వంగా ఉందని అభినందించారు.అనంతరం పూర్వ విద్యార్థులు తమకు విధ్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులైన రహ్మాన్,రాజెందర్,దేవిసింగ్,స్టాలిన్,వెంకటేశ్వర్లు,రాజ్యలక్ష్మీ,గార్లను ఘనంగా సన్మానించి వారిచే ఆశీర్వాదము తీసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆమంచ ప్రకాశ్,కొత్త నగేష్,నంద్యాల సురేందర్,ఎస్ రాజు,వి సంపత్,ఎన్ ప్రభాకర్,కె కుమార్,నవీన్,భాస్కర్,శారద,మెహరున్నిసా,ఎ ప్రభాకర్,సుధాకర్,వి రాజు సమ్మక్క,రాజ్కుమార్,రాకేష్,లింగమూర్తి,ధనలక్ష్మీ,పి నాగరాజు,గుజ్జరి సరిత, కూరపాటి రజిత, పెద్ద, చిన్న గాజుల మల్లికార్జున,వడ్లకొండ రాణి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.