రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్ జన్మదిన వేడుకలు హనుమకొండ జిల్లా చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఎండి సత్తార్ బాయ్ ఆధ్వర్యంలో భారీ సైజు కేక్ తో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 53వ డివిజన్ కార్పోరేటర్ సోదా కిరణ్ హాజరయ్యారు. అనంతరం వృద్దులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సత్తార్ బాయ్ మాట్లాడుతూ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , నియోజవర్గంలో అభివృద్ధి పనుల ప్రదాత అయిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా ఉండాలని దేవుని ప్రార్థించినట్టు సత్తార్ బాయ్ తెలిపారు. అనంతరం ముస్లిం నాయకులు ఎమ్మెల్యే ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తుల సంఘం నాయకులు
ఎండి కాశీం, ముర్తీజ , యాకుబ్ , అక్బర్ ,సలీం మరియు 53వ డివిజన్ తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *