ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని వివిధ గ్రామాల ముస్లింలు బక్రీద్ పర్వదినంను ఘనంగా జరుపుకున్నారు.భక్తి శ్రద్ధలతో మస్జిద్ లలో ప్రత్యేక నమాజ్ లు చేశారు.మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో అహ్మదీయ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం జమాత్ సర్కిల్ ఇంచార్జ్ ముహమ్మద్ అక్బర్ స్థానిక మస్జిద్ లో ప్రత్యేక నమాజ్ చేయించి అహ్మదీయ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ సాహెబ్ అయ్యదహుల్లాహ్ తాలా గత సంవత్సరం లండన్ లోని ఇస్లామాబాద్ మస్జిద్ ముబారక్ లో ఇచ్చిన ఖుత్బా ప్రసంగాన్ని చదివి వినిపించారు.వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం చేసిన త్యాగానికి గుర్తుగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.హజ్రత్ ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ ను దైవాదేశం ప్రకారం బలిచ్చేందుకు సిద్దం కావడం చివరి నిమిషంలో అల్లాహ్ ఆయన త్యాగనిరతికి మెచ్చి ఇస్మాయిల్ ను కాపాడటం చరిత్ర లో మరిచి పోలేని సంఘట అని అన్నారు.ప్రవక్త ఇబ్రహీం చూపిన మార్గంలో ప్రతీ ముస్లిం నడవాలని ఆయన కోరారు.ఈ వేడుకలో స్థానిక అహ్మదీయులు వలీపాష,యాకూబ్, షరీఫ్,ఖాసిం,అహ్మద్, అన్వర్, హాజీమియ, అంకూస్, నజీర్,రియాజ్,బాష,జమాల్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.