ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు

ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు ..

ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో తుర్లపాడు గ్రామంలో జరుగు బడేమియా హజరత్ ఉర్సు ఉత్సవాలను నందిగామ శాసనసభ్యులు డా”మొండితోక జగన్ మోహన్ రావు రావు ప్రారంభించారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ,స్థానిక వైసీపీ నాయకులు ఎంపీపీ అభ్యర్థి షేక్ మలక్ బషీర్ మాట్లాడుతూ సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఉత్సవాలు ప్రారంభించడం జరిగిందని అప్పట్లో ఎటువంటి వాహన సౌకర్యం లేని కారణంగా, ఎడ్ల బండి ద్వారా పెండ్యాల తదితర ప్రాంతాల నుంచి ప్రయాణం కొనసాగిందని ,అప్పటినుంచి ఇప్పటి దాకా ఎడ్లబండి ద్వారా కుటుంబ సభ్యులు మొత్తం అక్కడికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రాత్రి జరిగే ఉత్సవాలలో పాల్గొని, జాగారం చేసి రావడం జరుగుతుందని, అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందనే నమ్మకంతో కులమతాలకు అతీతంగా ప్రజలు ఇక్కడకు చేరుకొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు ,

అనంతరం MF గ్రూపు తరఫున మజ్జిగ ప్యాకెట్లు ,వాటర్ బాటిల్ లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ,ఎమ్మెల్యే ఎడ్ల బండి ఎక్కి యువతలో ఉత్సాహం నింపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.