బీజేపీ రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ ఆదేశానుసారం జఫర్ ఘడ్ మండలంలోని బీజేపీ శ్రేణులు ఘనంగా ఎన్నికల విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.మండల కేంద్రంలో ఎన్నికల విజయోత్సవ సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చుతూ ఊరేగింపుతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ముహమ్మద్ వలీపాష,బీజేపీ మండల అధ్యక్షులు తాటి సురేష్ గౌడ్ మాట్లాడుతూ..
దేశ సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించే 5రాష్ట్రాల ఎన్నికల్లో 4రాష్ట్రాలలో బీజేపీ గెలుపొందడం చాలా గొప్ప శుభపరిణమని,
అందుకే ఈ విజయాన్ని స్వీట్స్ పంచుకొని సెలెబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు అంజిరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి రామరాజు పందిబోయిన యాదగిరి,మారపెల్లి రవి, వడ్లకొండ రాజు, తదితరులు పాల్గొన్నారు.
