ఘనంగా మన బస్తి - మన బడి కార్యక్రమం ప్రారంభోత్సవం

స్థానిక మరిపెడ మున్సిపాలిటీ నందు గల జడ్ పి ఎస్ ఎస్ . సీతారాంపురం పాఠశాల యందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,గౌరవ మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారు పేద విద్యార్థుల కొరకు ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని స్థానిక సీతారాంపురం పాఠశాల యందు సభ అధ్యక్షురాలు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గుగులోతు సింధూర కుమారి గారు అధ్యక్షతన , డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, మరిపెడ ను విద్యా వనరుల కేంద్రం గా తీర్చిదిద్దిన మాజీ మంత్రివర్యులు , ఎమ్మెల్యే శ్రీ డి.యస్.రెడ్యా నాయక్ గారు ప్రారంభించడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలోఎమ్మెల్యే రెడ్యా నాయక్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 12 రకాల వసతులతో 26 వేల పైచిలుక పాఠశాలలకు , 20 లక్షల మంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేలా మన ఊరు మన బడి ఈ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రoలో ప్రాంభించడం గొప్ప అవకాశం అని కొనియాడారు .బంగారు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు తోనే సాధ్యపడుతోందని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు , బిల్డింగ్ నిర్మాణం , కిచెన్ షెడ్ల నిర్మాణం, డైనింగ్ రూమ్ , నీటి వసతి , కరెంటు వసతి ,పెయింట్ , ఫర్నిచర్ , ల్యాబ్ గ్రంథాలయం అందుతుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పెద్దలు శ్రీ గుడిపూడి నవీన్ గారు డోర్నకల్ యువజన నాయకులు అన్న డి.యస్ రవి చంద్ర గారు మున్సిపల్ చైర్మన్ సింధూర గారు ,జెడ్ పి టి సి శారద రవీందర్ గారు , ఎంపీపీ అరుణ రాంబాబు గారు , వైస్ చైర్మన్ బుచ్చి రెడ్డి గారు , వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు , స్థానిక కార్పొరేటర్లు , మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు , ఎంపీడీవో దన్ సింగ్ గారు , ఎం ఆర్ ఓ రామ్ ప్రసాద్ గారు , నోడల్ హెడ్ మాస్టర్ రఘుజీ గారు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధురి గారు , పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు, జిల్లా , మండల నాయకులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.