ఘనంగా మసీహ్ మౌఊద్ దినోత్సవ సమావేశం

మండలంలోని కొండూరు, కాట్రపల్లి గ్రామాలలో ముస్లింలు అహ్మదియ్య ముస్లిం జమాత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల అహ్మదియ్య అధ్యక్షులు ముహమ్మద్ యూసుఫ్,ముహమ్మద్ ఖాజామియ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ లతీఫ్ షరీఫ్, సర్కిల్ ఇంచార్జ్ మౌల్వీ ముహమ్మద్ అక్బర్,హైదరాబాద్ నుండి వచ్చిన మౌల్వీ నూర్ మియాలు పాల్గొని అహ్మదియ్య జమాత్ ఆవిర్భావ వేడుకల నుద్దేషించి మాట్లాడారు. సర్వ మతాలు ఎదురు చూస్తున్న కలియుగ అవతార పురుషుడు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం ఖాదియాన్ గ్రామంలో13ఫిబ్రవరి1835 సంవత్సరములో జన్మించారని, వారు బాల్యం నుండే ధార్మికంగా ఉండేవారని వారికి40 సంవత్సరములు వయసు వచ్చిన తర్వాత అల్లాహ్ తాలా వారికి నీవే ఈ కాలపు కలియుగ అవతార పురుషుడవని,భవిష్యవాణి ద్వారా తెలియజేయడం జరిగిందని,అందుకుగాను 23మార్చి1889సంవత్సరంలో అహ్మదియ్య జమాత్ ను స్థాపించడం జరిగిందని వారు 26మే1908 న పరమ పదించిన తర్వాత ఖిలాఫత్ వ్యవస్థ ఏర్పడిందని, ప్రస్తుతం 5వ ఖలీఫా మిర్జా మస్రూర్ అహ్మద్(లండన్)ఆధ్వర్యంలో215 దేశాలలో అహ్మదియ్య జమాత్ అనగా నిజమైన ఇస్లాం ధర్మ ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు.మతాలకతీతంగా అందరూ కలియుగ అవతార పురుషుడైన (హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం) గారిని విశ్వసించి వారి బోధనలను విని, చదివి ఆచరించాలని కోరారు.పూర్తి వివరాలకు అల్ ఇస్లాం డాట్ కం లాగిన్ అవ్వండని కోరారు.అనంతరం వారు
ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి15 మంది యువకులు,మరియు స్ధానికులు నూరుద్దీన్, అబ్బాస్,సత్తార్,నాసర్ మస్తాన్,అక్బర్,రహ్మాన్,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.