ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

మండలం లోని శైవ క్షేత్రాలు అన్ని తెల్లవారు జామునుండే శివ నామ స్మరణతో మారు మోగాయి.జుజ్జూరు గ్రామములో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి వారికి ఉదయం నుండి అభిషేక కార్యక్రమాలు మరియు స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహాశివరాత్రి పురస్కరించుకొని గ్రామంలో వాతావరణం ఎలా ఉన్నది తెల్లవారుజాము నుండి వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా గ్రామంలో భరతనాట్యం మ్యూజికల్ నైట్ చెక్క భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా అఖిలాండేశ్వరి అమ్మవారి యువత ఆధ్వర్యం బండారుపల్లి మహేష్ , పానకాల ప్రసాద్ ప్రభ బండ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఏర్పాటుచేసిన మహిళలతో ప్రత్యేక డప్పు కళాకారుల బృందము ఛూపరులను బాగా ఆకట్టుకుంది కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కొరకు దేవస్థానం వద్ద ఏర్పాట్లు బాగా ఏర్పాటు చేశారు అదేవిధంగా యస్.ఐ. మణి కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు . నరసింహారావు పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న బాల చాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో తెల్లవారుజాము నుంచి స్వామివార్లకు కు సంప్రోక్షణ మరియు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పంచామృతములతో పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో మంగళ స్నానం ,నాలుగు గంటలకు విశేష అలంకరణ దర్శనము జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ తెల్లవారుజాము నుంచే మాస్కులు లు ధరించి స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు .ఆలయ అర్చకులు మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల నుండి విశేషంగా పూజా కార్యక్రమం ఉన్నాయని తెలియజేశారు. 6 గంటలకు పార్ధివ లింగేశ్వర స్వామి సామూహిక అభిషేకము మరియు తొమ్మిది గంటలకు కు శాంతి కళ్యాణము, 12 గంటల 15 నిమిషాలకు లింగోద్భవ కాలా అభిషేకము జరుగుతున్నాయని ని దేవాలయ అర్చకులు నాగ సాయి శర్మ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శీలం రమణారెడ్డి , పచ్చలా కోటేశ్వరావు తదితరులు పాల్గొని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.