ఘనంగా శ్రీ శ్రీ శ్రీ భక్తాంజనేయస్వామి జీవ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం

ప్రత్యేక హోమాలు, పూజలలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ దంపతులు

పెద్దసంఖ్యలో పాల్గొన్న వార్డు ప్రజలు

చింతలచెరువు లోని శ్రీ శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ నూతన జీవ ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, వేద పారాయణ, మన్యురుద్ర నవగ్రహ అధివాస హోమంలో వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆశీస్సులతో ఆంజనేయ స్వామి నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పురాతన ధ్వజస్తంభం స్థానంలో నూతన జీవ ధ్వజ స్తంభం ప్రతిష్ఠ కార్యక్రమం జూన్ నెల 1వ తేది బుధవారం నాడు వార్డు ప్రజలు, ఆలయ కమిటి సభ్యుల సహకారంతో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేద పండితులు వేదం గురునాధ శర్మ, ఛంభుని సునీల్ శర్మ, ఛంభుని వెంకటసాయి శర్మ, వెలమంచి సాయిరాం శర్మ ఆధ్వర్యంలో జీవ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బైరబోయిన శ్రీనివాస్, బాల్తు కుమార స్వామి, భోనగిరి నర్సయ్య, గరిగంటి లింగయ్య, వేల్పుల సురేష్, కుంచం రఘు, కుంచం రాజు, బాల్తు శ్రీనివాస్, అయితగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.