బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త సంకినేని అరుణ్ రావు జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో భారతీయ జనతా యువమోర్చా పట్టణ అధ్యక్షుడు దోసకాయల ఫణినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో సంకినేని అరుణ్ రావు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్, బిజెపి ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు వల్దాసు ఉపేందర్, బిజెపి పట్టణ అధ్యక్షుడు అబీద్, ప్రముఖ వ్యాపారవేత్త శిశిందర్, జిల్లా నాయకులు పల్స మల్సూర్, సంధ్యాల సైదులు , నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.