ఈ69న్యూస్ పాలకుర్తి/మార్చి20
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఈ రోజు తెల్లవారు ఝామున సైకిల్ పై వస్తున్న చింతల వెంకట్ రాంనర్సయ్య (74)అనే వృద్ధుడిని అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా108 అంబులెన్స్ వాహనంలో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగిఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.
స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుంటున్నట్లు,లారీ డ్రైవర్ పరారీ లో ఉన్నాడని వెల్లడించారు.