చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘటన బీమాకొరేగావ్

1/1/20201

నల్లగొండ

బీమాకొరేగావ్ ఘటన స్ఫూర్తిని కొనసాగిస్తాం

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘటన బీమాకొరేగావ్ అని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అట్టిచరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత బడగుళబలహీన వర్గాల పై,బుద్ది జీవుల పై వుందని కేవీపీఎస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.

శుక్రవారం రోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పెద్ద గడియారం సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద భీమాకోరేగావ్ చారిత్రక సంఘటనను విజయ్ దివాస్ గా నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ
సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది అన్నారు.

ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కొరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో “విజయస్తూపం” ఏర్పాటు చేసిందని అన్నారు. బ్రిటీషు ప్రభుత్వం., యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్థూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేదని కొనియాడారు.
తరువాత స్వతంత్రానికి ముందు ఈ బ్రాహ్మణ వ్యవస్థతో జరిగిన రహస్య అధికార బదిలీ ఒప్పందానికి తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అంటరాని(మహర్ జాతిని) వారిని సైన్యం, పోలీసు విభాగాలలో చేర్చుకోకూడదని 1927 లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాబాసాహెబ్ అంబేద్కర్ “ఇది పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర” అంటూ, విజయ స్థూపం వద్ద ప్రదర్శనకు పిలుపునివ్వడంతో దేశ నలుమూలల నుండీ లక్షలాది ప్రజలుహజరయ్యారని అన్నారు.
అప్పటి నుండీ బాబాసాహెబ్ దివికెగిసే వరకు కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న బాబాసాహెబ్ తప్పకుండా విజయ స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారని అన్నారు.

జనవరి 01 ని శౌర్య దినోత్సవంగా జరుపుకుని, మన(మహర్ జాతి)వీరుల గాథలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.నేటికీ మనువాద పాలకుల పాలనలో దళితులు గిరిజనులు సామాజిక అణచివేతకు గురవుతున్నారనీ అన్నారు.నేడు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు సాగుతున్నాయని అన్నారు. రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మాని పార్టీ భిక్షం, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి పి.డి.ఎ.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరి సాగర్ కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు బల్లు రవీందర్ , రాయల సీతారాములు ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి అధ్యక్షులు ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.