|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు ఫ్లై ఓవర్ వద్ద వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వేసవికాలంలో ప్రతిరోజూ వందలాది మంది బాటసారులకు దాహాన్ని తీరుస్తుంది. ఉగాది పర్వదినం నుండి ప్రతిరోజూ ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సోమవారం నాడు కుంచపర్తి క్ర్రష్ణ, దీప దంపతుల ఆర్దిక సహాయంతో వాసవి క్లబ్ జెడ్ సి కలకోట లక్ష్మయ్య ఆధ్వర్యంలో 500 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ‌
ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ క్లబ్ జెడ్ సి రాచకొండ శ్రీనివాస్, శ్రీరంగం రాము, మంచాల శ్రీనివాస్ గుప్త, తెరటపల్లి సతీష్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.