ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ & వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బయలుదేరిన ఓయూ జేఏసీ అధ్యక్షుడు దత్తాత్రేయ వివిద విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా మా పోరాటం కొనసాగుతుందని ఈ ప్రభుత్వంను గద్దె దింపే వరకు మా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు