చల్లా ధర్మారెడ్డి శాసనసభ్యత్వాన్నివెంటనే రద్దు చేయాలి-ఎమ్మార్పీఎస్

పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ని శాసనసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి
ఎమ్మార్పీఎస్ నాయకులు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓసి మహాగర్జన సదస్సులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నేడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండలంలోని గుడెప్పాడ్ జాతీయ రహదారి జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ ధర్నా లో పాల్గొన్న “వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల మురళి మాదిగ పాల్గొని ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మారెడ్డి గారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని,
అతని తక్షణమే టిఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలి,అని అదే విధంగా ఎన్నికలలో పోటీ చేసే హక్కును కూడా తొలగించాలని అన్నారు.
స్థానిక పరకాల అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగన్ని దిక్కరిస్తూ చేసిన వ్యాఖ్యలకు మూల్యంగా అంబేద్కర్ విగ్రహం ముందు తన ముక్కు నేలకు రాయాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మస్కే సదయ్య మాదిగ, శ్రీధర్ గోవింద్ రాజీవ్ మాదిగ ,పుట్ట బిక్షపతి మాదిగ మాదాసి ప్రభాకర్ మాదిగ పరిగి నవీన్ మాదిగ కొయ్యడ సదానందం స్వామి మాదిగ ఇమ్మడి పవన్ మాదిగ అనిల్ శ్యాం మాదిగ,రాకేష్ రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.