#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

18వ దశకంలోనే గ్రామాల పరిశుభ్రత, తన కీర్తనల ద్వారా మూడనమ్మకాల నిర్మూలన , చదువు ద్వారానే విజ్ఞానం సాద్యమని చెప్పిన సంఘసంస్కర్త సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలు చాకిరేవు రజకసంఘం అద్వర్యంలో కొయ్యలగూడేంలోగ్రామ రజక సంఘం అధ్యక్షులు జన్ని పల్లి రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా జిల్లా అద్యక్షుడు చాటపర్తి పోసిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కొండపల్లి హజరు అయ్యారు. ఈ సందర్భంగా రవి కొండపల్లి మాట్లాడుతూ సామాన్య రజక కుటుంబంలో పుట్టిన గాడ్గే బాబా పెద్దగా చదువు లేకపోయినా సమాజచైతన్యం కోసం 18వ దశకంలోనే చీపుర్లు పట్టుకుని వీధులు శుభ్రం చేయడం‌,తన కీర్తనల ద్వారా మూడ నమ్మకాలను రూపమాపడం ,చదువు ద్వారానే విజ్ఞానం సాద్యమని ప్రజలని చైతన్య పరిచిన గొప్ప సంఘ సంస్కర్త అని ,అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం నిజాం నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత ఐలమ్మ పోరాట తెగువతో, గాడ్గే బాబా సామాజిక చైతన్య స్పూర్తితో రజకులంతా ఐక్యంగా వుండి తమ హక్కుల కోసం మరియు రజకుల చిరకాల కోరిక యస్సి హోదా కోసం పోరాడాలని దానికోసం రజకులకు అండగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నుండి చాకిరేవు రజకసంఘం అండగా వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బువ్వనగిరి దుర్గాప్రసాద్, కడకట్ల గడ్డియ్య, మెట్ట లక్ష్మీ ప్రసన్న, పాలూరి శ్రీను, చిలంత రావుల గంగాధర రావు, మెట్ట సత్యనారాయణ, కడకట్ల అన్నవరం, బూరుగుపల్లి గంగరాజు, చిలo త రావుల సర్వేశ్వరరావు, తాడిమల్ల వెంకటేశ్వర రావు, దుర్గారావు, షేక్ హుస్సేన్ , ఆనంద్ వడ్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.