#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

వరంగల్ చార్ బౌళి లో 3 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఈ రోజు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, స్థానిక కార్పోరేటర్లు బాలిన సురేష్, బస్వరాజు శిరీష శ్రీమాన్ మరియు కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించారు.. రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.. ఎమ్మెల్యే నరేందర్ ను కార్పోరేటర్ బాలిన సురేష్ తన నివాసంలో సన్మానించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.. చార్ బౌళిలో రోడ్డు పనులను వేగంగా పూర్తి చేస్తాం, ఈ రోజు అందులో భాగంగా పనులను పరిశీలించడం జరిగింది..ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.. యువ కార్పోరేటర్లు తమ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని,అన్ని డివిజన్ లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.