తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలుచాకలి ఐలమ్మ మనవడు మృతి

చిట్యాల లక్ష్మీ నరసయ్య మృతి సిపిఎం కి తీరని లోటు, సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలుచాకలి ఐలమ్మ మనవడు సిపిఎం సీనియర్ నాయకులు చిట్యాల లక్ష్మీనరసయ్య మృతి సిపిఎం కు తీరని లోటని సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న అన్నారు,పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చాకలి ఐలమ్మ మనవడు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు, ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన భౌతికాయం మీద ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు,ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ లక్ష్మీనర్సయ్య సిపిఎం లో చురుకైన పాత్ర పోషించిడని,కూలి పోరాటం లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండేవారని వారన్నారు,నేడు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలుఅవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యువత లక్ష్మీ నరసయను ఆదర్శంగా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సోమా అశోక్ బాబు, సిపిఎం మండల నాయకులు మాసం పల్లి నాగయ్య ,ముస్కు ఇంద్రారెడ్డి, గ్రామ నాయకులు జీడి సోమయ్య, చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల యాకయ్య, చిట్యాల రాణి, గాదె పాక యాకయ్య, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.