చిట్ ఫండ్ పేరుతో ఛీటింగులు - రోడ్లమీదికి ఎక్కిన బాధితులు

హనుమకొండ టౌన్ లోని గోపాలపూర్ ,జవహర్ నగర్ కాలనీలో శుభ నందిని హోమ్స్ ముందు చిట్ ఫండ్ లో చిట్టి వేసిన బాధితులు చిట్టి డబ్బులు ఇయ్యడం లేదని ఆందోనలతో నిరసన చేపట్టారు. చిట్టి పూర్తయిన కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా 5 నెలల నుంచి తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్ ఫండ్ యజమానులు ఛీటింగులు చేస్తున్నారని చిట్టి బాధితులు వాపోయారు. ఈ చిట్టి వేసిన వారు దాదాపు 30 మంది లోకల్ వాళ్లేనని ఇంకా వివిధ గ్రామాల్లో ఇలా చిట్టీలు వేసిన వారు ఎంత మంది ఉన్నారో అని విమర్శలు విపిస్తున్నాయి. చిట్టి డబ్బుల పేరుతో చిట్ ఫండ్ యాజమాన్యం రియలెస్టేట్ చేస్తూ డబ్బులు పొగుచేసుకుంటున్నారు. వేసిన చిట్టి డబ్బులు అడిగితే భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని వారు చెప్పినట్టు వింటే సరే లేకుంటే మీ ఇష్టం ఉన్న చోట చేప్పుకొండని అంటున్నారని బాధితులు అంటున్నారు. చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి ఇయ్యకుండా నెలలు గడుస్తున్నా చిట్ ఫండ్ చుట్టూ తిరుగుతున్నామని డబ్బులు అడిగితే మా వెంచర్ ఉంది అందులో ప్లాట్ ఇస్తాం తీసుకో అంటున్నారు. అక్కడికి వెళ్ళితే ప్లాట్ లకు అనుమతులు లేని వాటిని చూపించి ఇదే అని చెపుతున్నారు.మేము వేసిన డబ్బులు మాకు ఇచ్చే వరకు ఇలానే నిరసనలు చేస్తామని బాధితులు అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.