పాలడుగు నాగార్జున రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ధళిత కుటుంబానికి ధళితబందు పదకం చిత్తశుద్దితో అమలు చేయాలనీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్తాయి సమావేశాలలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పాలడుగు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సాబ్ కరీంనగర్ జిల్లాలో ఇటివల ధళిత సాదికారత పధకానికి ధళితబందు పేరు పెట్టి అమలు చేస్తామన్నారు. సంవత్సరానికి 2 లక్షల మందికి 20 వేల కోట్లు కేటాయిస్తామనీ చెప్పి నేడు అమలు చేయడం లేదనీ అన్నారు.కేవలం 119 నియోజకవర్గల లో 11900 మందిని సెలెక్ట్ చేస్తున్నారనీ అన్నారు. రాష్ట్రంలో 17 లక్షల ధళిత కుటుంబాలున్నాయనీ అందరికి అందించాలంటే ఎన్నీ సంవత్సారాలు పడుతుంధో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ధళితులకు 3 ఎకరాభుామీ ఇస్తామనీ చేతులెత్తిసినారనీ అన్నారు.భుాములు ఇవ్వక పోగా అనాదిగా ఖాస్తు చేసుకుంటున్నా భుాములను రైతు వేదికలపేరా,స్మాశాన వాటిక, వనసంరక్షణ పేరున ఉన్న బూాములను లాగేసుకున్నారనీ అన్నారు.డబుల్ బెడ్ రుాం ఇండ్ల జాడే లేదనీ అన్నారు.
యస్సీ యస్టీ యాక్షన్ ప్లాన్ అమలు సరిగా అమలు జరుపడం లేదనీ అన్నారు. ఇండస్ట్రీయల్ రుణాలకు సబ్సీడీలు గత 3 సంవత్సరాలుగా అందించండంలేదనీ అన్నారు. కులవివక్ష అసమానతలకు గురియవుతుా సామాజికంగా ఆర్దికంగా వెనుకబడిన ధళితులకు చిత్తశుద్దితో అర్హతవున్న పేదలకు అందించే వరకు పోరాడుతామనీ తీర్మానం పెట్టగా సమవేశం ఎకగ్రీవంగా ఆమోదించింది.
ఈసమావేశాలకు రాష్ట్ర అద్యక్షులు జాన్ వెస్లీ ,అతిమెల మాణిక్ ,సాయిలీలా వ్యవరించారు. రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు. రాష్ట్ర నాయకులు కురుమయ్య , పరుశ రాములు ,మనోహర్ , బోడ సామేల్ , కుమార్ , గోపి , మహిపాల్ , రాజు ,ధినకర్, సురేష్ , రాదక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.