చిన్న గూడూరులో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు

చిన్నగూడూర్ మండలం ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం మండలం లో ఉన్నా గర్భిణీ స్త్రీల ను పరీక్షలు చేసి మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఆగష్టు 1 నుండి 7 వ తారీకు వరకు తల్లి పాల వారోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, తల్లి పాలు బిడ్డ కు తొలి వాక్సిన్ మరియు తొలి ఆహారం అని బిడ్డా పుట్టిన గంట లోపు పట్టే పాలు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. బిడ్డా పుట్టిన వెంటనే ముర్రు పాలు పట్టిస్తే భవిష్యత్తు లో ఎన్నో రోగాల బారి నుంచి రక్షించవచ్చు. బిడ్డాకు తల్లి పాలు పట్టడం వల్ల తల్లి, బిడ్డలిద్దరూ ఆరోగ్యం ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుందన్నారు. మొదటి ఆరు నెలలు తప్పకుండా తల్లి పాలు పట్టించాలన్నారు. ఈ కార్యక్రమం లో హెల్త్ సూపర్ వైజర్ రాధ కుమారి, వెంకటేశ్వర్లు, స్టాఫ్ నర్స్ మాధవి, ఏ ఎన్ ఎం నర్సబాయి, వనిత, శ్యామల, భారతి, శ్రీవాణి, ఆశ ఆరోగ్య కార్యకర్తలు సైదమ్మా, అనిత, కల్పనా, జ్యోతి, పుష్ప, సంధ్య, ఉపేంద్ర, కళావతి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.