చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ రూరల్ జిల్లా.

పరకాల నియోజకవర్గం.

….

ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం చలివాగు శివారులో రూ.3కోట్ల 90 లక్షలతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ

ఈ చెక్ డ్యాం నిర్మించడం వలన దాదాపు 10 గ్రామాల రైతులకు పంట నీరు అందుంతుంది..

ఈ చెక్ డ్యాం ద్వారా సుమారు 400 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కష్టాలతో కంట నీరు రాకూడదని,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఆనందగా ఉండాలని కేసీఆర్ గారి లక్ష్యం అని అన్నారు.

రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధావుడని,
రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతు వేదికలను ఏర్పాటు చేసారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అత్మకూర్ మండల ఎంపిపి మార్క సుమలత రజనికర్ గౌడ్, జేడ్పిటిసి కక్కేర్లా రాధిక రాజు గౌడ్, గుడేపాడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవరెడ్డి, స్థానిక సర్పంచ్ అర్షం బలరాం, స్థానిక ఎంపిటిసి అర్షం వరుణ్ గాంధీ, మరియు మండల నాయకులు రైతులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.