మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి, కంభాలపల్లి చెరువులను జిల్లా కలెక్టర్ కె. శశాంక గురువారం పరిశీలించారు. ముందుగా పర్వతగిరి చెరువును పరిశీలించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా చెరువుల పరిస్థిని పరిశీలించడం జరిగిందని, వర్ష తీవ్రత తగ్గినను వర్షాకాలం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.చెరువు నుండి పంట పొలాలకు నీరు వెళ్ళుటకు ఉన్న షట్టర్లు పనిచేయడం లేదని రైతులు తెలుపగా, వెంటనే సరి చేయాలని ఇరిగేషన్ ఈ. ఈ. ఎం. వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. చెరువు కట్ట మీద ఉన్న ముళ్ళ చెట్లను తొలగించాలని, గ్రామంలో ఏమైనా లూజ్ వైర్లు ఉంటే సరి చేయాలని, వర్షాకాలం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో శానిటేషన్ పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కంభాలపల్లి పెద్ద చెరువును సందర్శించి పరిశీలించారు. చెరువు వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. చెరువు ప్రక్కనే కాకతీయుల కాలం నాటి శివాలయం ఉన్నదని, ఎండాకాలంలో కూడా చెరువులో నీరు ఉంటుందని, పెద్ద మొత్తంలో, బరువు ఎక్కువ గల చేపలు ఈ చెరువులో లభ్యమౌతాయి అని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. చెరువు చుట్టూ ప్రక్కల వాతావరణం, చెరువును పరిశీలించి మంచి టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి, సామ్లాతండా, కంభాలపల్లి సర్పంచులు శ్యామ్, బాలాజీ, ఎస్. వీరన్న, ఇరిగేషన్ ఈ. ఈ., డి. ఈ.. ఏ. ఈ. లు, తహశీల్దార్ నాగాభవాని, ఎం.పి. డి. ఓ. వెంకటేశ్వర్లు, ఎం. పి. ఓ. హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.