తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ నెల 27 న మహా శివ రాత్రి సందర్భగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం మునగాల వారి ఆధ్వర్యంలో న ఆదివారం సూర్యాపేట జిల్లా మునగాల లోని శ్రీ సాయి గాయత్రీ పాఠశాలలో జరగనున్న చదరంగం పోటీల బ్రోచర్ ను గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మరియు నడిగూడెం SI . ఏడుకొండలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగా పోటీలతో మానసిక ఉల్లాసాన్ని ఆలోచన శక్తి పెంపొందుతుందని క్రీడల్లో ప్రతిభ చూపి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉన్నారు.
ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి పది మంది క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేయడం జరుగును, .ఈ పోటీలు పాల్గొనే క్రీడాకారులు తల్లిదండ్రులు అందరూ మాస్క్ చెస్ సెట్ మరియు క్లాక్ వెంట తీసుకొని రాగలరని టోర్నమెంట్ డైరెక్టర్ బంగారపు శ్రీనివాస్ తెలిపారు పూర్తి వివరాలకోసం చరవాణి నెంబర్ 9505077100,9908013880 సంప్రదించవలసినదిగా కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఉపాధ్యక్షులు కాశీ నాగార్జున చారి , పాల్గొన్నారు
