చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ
జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచ్ ల పైన టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనిచివేత ధోరణి చేస్తా ఉంది. ఉదాహరణకు పెంబర్తిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ను టీఆర్ఎస్ పార్టీలోకి మారే విధంగా వారు తప్పు చెయ్యని పనులను కూడా తప్పుగా భావించి వారిని నిందిస్తూ, అఫీషియల్ DPO లను చెప్పు చేతుల్లో పెట్టుకొని నువ్వు పని చేస్తావా ఇంటికి పోతావా అని… బెదిరిస్తూ… నేను చెప్పిన వాళ్ళను సస్పెండ్ చేయాలని అనే ఈ విధంగా ఈ ప్రభుత్వ శైలి ఉంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వీరికి ఆదేశాలు ఇచ్చారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచిన వారిని బెదిరిస్తూ DPO ల ద్వారా తీసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మల్లంపల్లి, తిరుమలగిరిలో సర్పంచ్ పుల్లయ్య అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు.
ఏ తప్పు చేశారని సస్పెండ్ చేశారు వారు ఇచ్చిన సమాధానం గ్రామ పంచాయితీలో భూమి లేకపోతే ఒక దాత దగ్గర డబ్బు సేకరించి గ్రామపంచాయతీ కి అప్పగించారు.
ఎప్పుడో నక్సలైట్లు కాల్చివేసిన లారీలను టెండర్ పెడితే ఆ డబ్బులు కారోబారి కట్టకపోతే
నేడు జమ చేసినందుకు సస్పెండ్ చేస్తారా.
ఇదెక్కడి సంస్కృతి…. చేసిన పనుల బిల్లు రికార్డు చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి పద్ధతి కాబట్టి కక్షసాధింపు చర్యలో భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పుల్లయ్య ను మల్లంపల్లి కుమార్ ను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాపాడుకుంటుంది.
గ్రామాల్లో మీరు సస్పెండ్ చేసిన అంతమాత్రాన వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు గ్రామాల్లో వారికి మంచి పేరు ఉంది.
గ్రామ సర్పంచ్ గా మంచి గుర్తింపు ఉంది.
కక్ష సాధింపు కోసం వారి గ్రామాల్లో ఓడిపోయిన వారు కంప్లైంట్ చేస్తే సస్పెండ్ చేస్తారా ఇది ఎక్కడి న్యాయం మేము డీపీవో గారిని సూటిగా అడుగుతున్నాం.
ఈ విధంగానే కొనసాగిస్తేతే వారికి
తదుపరి చర్యలు ప్రాక్టికల్ గా చూపిస్తాం.
టిఆర్ఎస్ లో ఉండి ఎంతమంది అవినీతికి పాల్పడుతున్నారో
కాంగ్రెస్ పార్టీ లొ ఉండి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి జనగామ జిల్లాలో టిఆర్ఎస్ వాళ్లు దాదాపు 50 మంది పైగా ఈ రోజు అవినీతికి పాల్పడి వారికి నోటీస్ లు ఇవ్వబడ్డాయి కానీ వారిని ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు.
దేవరుప్పుల మండలం లో సర్పంచ్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు వారికి నోటీసు ఇచ్చారు.
మరి వారిని ఎందుకు ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు.
వారు టిఆర్ఎస్ పార్టీ లోకి మారగానే అన్ని బంద్ అయిపోయాయి సస్పెండ్ లేవు ఏమి లేవు అంటే ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా బెదిరిస్తూ వారు చేయని నేరారోపణ వారిపై మోపుతూ అధికారం వారి చేతిలో ఉందని కక్షసాధింపు చేస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరం లేదు అధికారులు మరియు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కొందరు నాయకులకు రోజులు ఒకేలా ఉండవు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అవసరం ఎంతో ఉంది.
అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై గాని నాయకులపై గాని సర్పంచులు పై గాని ఇలా నిరూపణ లేని కక్ష సాధింపు కంప్లైంట్ పెట్టి వారిని ఇబ్బంది పెడితే వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.