ఛత్రపతి శివాజీ విగ్రహా ఆవిష్కరణ మహోత్సవం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో అరే క్షత్రియ కులస్థుల ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రైతు ఋణవిమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసినులయ్యారు.ప్రజాప్రతినిధులు శివాజీ గొప్పతనం గురించి వివరించారు.ఇటు తెరాస కార్యకర్తలు , అటు కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకులను ఒకే వేదికపై చూసి ముచ్చటపడ్డారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.