నందిగామ మండలం లో ఏకగ్రీవం లో తొలి విజయం.
మాగల్లు సర్పంచిగా
గుంటి. ఆశజ్యోతి సతీష్.
నందిగామ మండలం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం లోని నందిగామ మండలం మాగల్లు గ్రామ పంచాయతీ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ఏకగ్రీవ పంచాయతీగా నమోదయింది.
సర్పంచిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుంటి ఆశ జ్యోతి సతీష్ ఎన్నికయ్యారు.
గ్రామంలో మొత్తం 12 వార్డులకు గాను 7 వార్డులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచి గుంటి ఆశ జ్యోతి సతీష్, మరియు పాలకవర్గం సభ్యులకు జగ్గయ్యపేట శాసనసభ్యులు గౌరవనీయులు సర్దార్ స్వామినేని ఉదయభాను ప్రభుత్వ విప్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొమ్మినేని రవిశంకర్ లు అభినందనలు తెలిపారు.