జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విస్తృత స్థాయి సమావేశం

ఈ రోజు (12/02/2021) జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విస్తృత స్థాయి సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ…

👉 జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఇంద్ర గారికి, జిల్లాలోని సీనియర్ నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, యూత్ అధ్యక్షులకు మరియు జిల్లాలోని అన్ని మండల అధ్యక్షులకు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీ నాయకులకు, టౌన్ అధ్యక్షులకు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీ నాయకులకు, యూత్ నాయకులకు అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు.

👉 నేటి విస్తృతస్థాయి సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం…

👉 పార్టీని బలోపేతం చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని బలోపేతం చేయాలి.

👉 కాంగ్రెస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ బిజెపిలకు కోవట్ట్ గా పని చేస్తున్నారు. పేరుకే కాంగ్రెస్ పార్టీ కానీ మన పార్టీ అంతర్గత సమాచారాన్ని పూర్తిగా తెరాస భాజపా పార్టీలకు అందజేస్తున్నారు.

👉 ఇలాంటి వారిని పార్టీ నుండి బహికరించలి కటినమైన చర్యలు తీసుకోవాలి.

👉 మండల్లో కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి.

👉 ప్రతి మండలంలో నెల రోజులకు ఒక సారి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

👉 అదేవిధంగా గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టి దిశానిర్దేశం చేయాలి. దానితో పాటుగా పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి.

👉 రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం కాయం, పార్టీని గెలిపించేందుకు జిల్లా నుండి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి.

👉 ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్య ఉద్దేశం నీళ్ళు నిధులు నియామకాలు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కుటుంబం బాగుపడితే సరిపోతుంది అనేలా వారి పాలనా ఒక నిజం నియంతృత్వ పోకడలతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నది.

👉 ప్రస్తుతం ఎమ్మెల్సీగా పల్ల రాజేశ్వర రెడ్డి
గెలిచి వెలగబెటింది ఏమి లేదు.విద్యార్థులకు, నిరుద్యోగులకు చేసిందేమీ లేదు. దానికి తోడు కరోనా మహమ్మారి వల్ల కాస్తోకూస్తో ఉన్నా జాబులు పోయినా పరిస్థితి వచ్చింది. అయినా ఈ సిగ్గులేని టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఓట్ల అడగడానికి రావడం సిగ్గుమాలిన చర్య.

👉 రైతు సమితిలో అధ్యక్షుడిగా ఉండి రైతుల కోసం మాట్లాడాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి తో చీకటి సంప్రదింపులు జరుపుతూ… తెలంగాణ ప్రజలకు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు.

👉 మొన్న జరిగిన సమావేశం కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్దీకరణ కోసం వాళ్ళు కళ్ళ మీదే పరిస్తుకి తీసుకొచ్చిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.

👉 2023 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో పార్టీ ని గెలిపించే దిశగా ప్రణాళికను తయారు చేసి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలి.

👉 రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 16 వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేందుకు తగిన కృషి చేయాలని జిల్లాలోని 12 మండలాల అధ్యక్షులు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు సమన్వయ తో పని చేయాలి.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.