తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజన్న ఆదేశానుసారం రేపు జనగామ జిల్లా కేంద్రం చౌరస్తాలో చేపట్టే నిరసన దీక్షను విజయవంతం చేయాలని స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్,మండల ఇంచార్జ్ గుజ్జరి రాజు పార్టీ శ్రేణులకు బుధవారం మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రామాలయం వద్ద జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయి పిలుపునిచ్చారు.వారు మాట్లాడుతూ…మండలం నుండి పార్టీ శ్రేణులు,ప్రజా ప్రతినిధులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్,జడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనువాస్,మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య,మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కడారి శంకర్,నియోజకవర్గ నాయకులు పసునూరి మహేందర్ రెడ్డి,పెండ్లి స్వామి మండల మహిళా అధ్యక్షురాలు గోలి కవిత,స్థానిక ఎంపీటీసీలు జ్యోతి రజితయాకయ్య,ఇల్లందుల స్రవంతిమొగలి,జఫర్గడ్ 1,2 గ్రామ శాఖ అధ్యక్షులు సింగారపు శ్రీధర్,కుల్లా రాజు మండల,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.