#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

జిల్లాలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామం….

జనగామ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారు….

ఈ రోజు జనగామ జిల్లాలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, కలెక్టర్ శివ లింగయ్య గారు, అదనపు కలెక్టర్ గారు, జెడ్పీ సిఇఓ గారు హాజరైనారు….

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల్లో రఘునాథ్ పల్లి మండల మేకల గట్టు గ్రామంలో ఉన్న బూదాన్ భూమి సమస్యలను అధికారులతో సర్వే నిర్వహించి తప్పకుండా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

అలాగే మొన్న ముఖ్యమంత్రి గారి హమీ ఇచ్చిన మెడికల్ కళాశాలను త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో జీవో తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు మరియు జిల్లాకు 4 అంబులెన్స్ లను తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆరోగ్య కార్డుల జారీ చేయాలని మంత్రిని అభ్యర్థించినాను అని అన్నారు. ఈ నిధుల పెంపు ద్వారా జిల్లా, మండల పరిషత్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేయడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు. ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా N.I.M.S దావఖానలో ఉచిత వైద్యం పొందేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు వీలు కలుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు, అని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.