(సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్.)
సిపిఎం జనగామ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని పివిఎమ్ పంక్షన్ హల్ నందు జులై 1, 2, 3 తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతున్నవి. ఈ శిక్షణ తరగతుల ప్రారంభం సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించి, అమరుల స్థూపానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ రాజకీయ శిక్షణ తరగతుల సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షత వహించగా ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పాల్గొని శిక్షణ తరగతులను ప్రారంభించిన అనంతరం అబ్బాస్ మాట్లాడుతూ
టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా పెట్టడం వల్ల టిఆర్ఎస్ కు ఒరిగేదేమీ లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి ఉపయోగం ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చు రేపుతోందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో మతాల పట్ల బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై కెసిఆర్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తో కలిసి పని చేసే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ తో పోరాడే పార్టీ సిపిఎం మాత్రమేనని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చలేదు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలు అన్నిటినీ ఐక్యం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంపును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, సాంబరాజు యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉపేందర్, బెల్లంకొండ వెంకటేష్, క్లాసులకు హాజరైన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు