మామూళ్ల మత్తులో అధికారులు!!*

( సీపీఎం జనగామ పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్ )

జనగామ పట్టణ నడిబొడ్డున జనావాసాల మధ్య బాణాసంచా దుకాణాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని వెంటనే జనావాసాలకు దూరంగా ఉండేవిధంగా ఆదేశాలిస్తూ, తగుజాగ్రత్తలు పాటించే దుకాణాలకు మాత్రమే అనుమతులివ్వాలని సీపీఎం జనగామ పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్ సంబంధిత అధికారులను కోరారు.

దివి: 30-10-2021 శనివారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని బాణాపురం మూడవ విడత ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పార్టీ Nprd శాఖ సమావేశం శాఖ కార్యదర్శి పాముకుంట్ల చందు అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ జనగామ పట్టణంలో యథేచ్ఛగా అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాల వల్ల ప్రమాదపు అంచున జనగామ పట్టణం ఉందని తెలిపారు. బాణాసంచా పేలుడు జరిగిన ఘటనలు దేశంలో, రాష్ట్రంలో అనేకం ఉన్నాయని ఈ పేలుడు దాటికి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయని, కుటుంబాలు వీధినపడ్డాయని గుర్తు చేశారు. బాణాసంచా దుకాణాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం సరైనది కాదని అన్నారు. జరగకూడని ప్రమాదమేదైనా జరిగితే దానికి భాద్యులు ఎవరు,..? ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించారా అని ప్రశ్నించారు. మామూళ్ల మత్తులో అధికారులు యథేచ్ఛగా దుకాణాలకు అనుమతులిస్తున్న సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకొని జనావాసాల మధ్య ఉన్న దుకాణాలను వెంటనే తొలగించాలని తెలిపారు. గతంలో నిర్వహించినట్లుగా జనావాసాలకు దూరంగా ఉన్న ఫంక్షన్ హల్లో గాని, ఖాళీ గ్రౌండ్ లో గాని తాత్కాలిక షెడ్లు వేసి తగుజాగ్రత్తలు పాటించే దుకాణాలకు మాత్రమే అనుమతులివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, ఉప్పరి వేణు, నాచు అరుణ, కానుగు బాలనర్సయ్య, ఇట్టబోయిన మధు, చిందాల వెంకటేష్, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.