E69news జఫర్ఘడ్ జాన్30
శ్రావణమాసం వస్తుంది జఫర్ గఢ్ మండల ప్రజల ఇలావేల్పు అయిన శ్రీ వేల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో జరిగే మహా జాతరకు వివిధ ప్రాంతాల రాష్ట్రాల నుండీ వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించలేక పోతున్నామని,
గ్రామ పంచాయితీ తరుపున కూడా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేక పోతున్నార ని గ్రామ ప్రజలు విచారం వ్యక్త పరుస్తున్నారు.గుట్ట కింద ఉన్న రామాలయం చుట్టుపక్కల పరిసరాలు అసాంఘీకా కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి.గుడి ముందు భక్తులకోసం నిర్మించిన మంచి నీటి భావి చెత్తాచెదరంతో కుడూకుపోయింది.బావితో పాటు రామాలయం దగ్గర ఉన్న విడిది రూములలో కరెంట్ సౌకర్యం లేదు భక్తులు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు.రాజకీయాలకతీతంగా అందరు కలిసి మంచి నీటి బావి మరమ్మతు చేయించి కరెంటు,టాయిలెట్స్ ఏర్పాటు చేయించి భక్తుల కోసం సౌకర్యాలు కల్పించాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను, కోరుతున్నారు.
