జయ సారథి రెడ్డిని గెలిపించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రచారం


హన్మకొండ:వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథిరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో వేయి స్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ….ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజలపై భారాలు మోపుతున్న బిజెపి టిఆర్ఎస్ కు ఓటు అడిగే అర్హత లేదని, ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కోరారు,నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు అదుపు లేకుండా పోయిందని, నిరుద్యోగ యువతను పట్టించుకునే పరిస్థితి లేదని, విమర్శించారు,ఎన్నికల జిమ్మీకుల కోసమే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల మోసం చేయడం కోసం ప్రకటన చేస్తుందని అన్నారు,ఈ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఎర్ర జెండా బలపరుస్తున్న వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం కుమారస్వామి వి సారంగపాణి ఏం.సంపత్ జి. రమేష్, ఇ. రాజు , డి.నరేష్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.