జర్నలిస్టులకు పోలీసు భరోసా కార్డులు ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా రంగంలో పనిచేస్తున్న
జర్నలిస్టులు అందరికీ పోలీసు వారి నుండి ఇబ్బందులు రాకుండా ప్రతి జర్నలిస్టుకు పోలిస్ భరోసా కార్డులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం అసోసియేషన్ నాయకులతో కలిసి సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ సంస్థ ఐడీ కార్డుతో పాటు అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా పోలీసులు ఫైన్ లు వేస్తున్నారని అందుకు సికింద్రాబాద్ మల్కాజిగిరి లో రాజు అనే 40 సంవత్సరాల అనుభవం వున్న అక్రిడేషన్ కార్డు జర్నలిస్టు అన్నారు.ఎంత చెప్పినా బతిమిలాడినా కానీ రాజు అనే జర్నలిస్టు కు 700 రూపాయల ఫైన్ వేయడం బాధాకరమైన చర్యగా గుర్తుచేశారు.ఎలాంటి లాభాపేక్ష లేకుండా వేతనాలు లేకుండా జెన్యూన్ గా పనిచేస్తున్న జర్నలిస్టులను పోలీసువారు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా జర్నలిస్టులు సోదరులు పోలీసులు ఇచ్చిన సూచనలు సలహాలు పాటించాలని తెలిపారు
ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినవారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌసుద్దీన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం బాలు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి దూపాటి శ్యాంబాబు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మానుకొండ రాము జిల్లా కోశాధికారి నాయిని రమేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.