జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య జీవో సర్క్యులర్ జారీ చేయాలి

మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న ప్రైవేటు పాఠశాల,కళాశాలల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను సవరించి పూర్తిగా ఉచిత విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని.అదేవిధంగా అన్ని మండల విద్యాధికారులకు సర్కులర్ జారీ చేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ ను కలిసి వినతిపత్రంఅందించారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మానుకొండ రాము లు మాట్లాడుతూ ఎలాంటి వేతనాలు, లాభాపేక్ష లేకుండా,నిస్వార్థంతో, నీతి నిజాయితీతో, ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలు వారు విద్యాభ్యాసం చేస్తున్న పాఠశాలల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు అసోసియేషన్ లకు అతీతంగా కలిసి రావాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు చిలుకల చిరంజీవి, నియోజకవర్గ కార్యదర్శి రావత్ శివ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.