#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS
  • ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దూలం శ్రీనివాస్
    తొర్రూరు:
    జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి చేస్తుందని సంఘ జాతీయ కార్యవర్గ సభ్యులు దూలం శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా ఐజేయూ జిల్లా అధ్యక్షుడు నాగపురి అశోక్ గౌడ్ లు అన్నారు.

శుక్రవారం డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఐజేయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు సభ్యత్వాలు అందజేశారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ…
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐజేయూ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువల నుంచి ఉద్భవించిందే ఐజేయూ అని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తుందని గతంలో ప్రకటించారని, ఆ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల నిధిని కేటాయించిందని, ఆ మొత్తాన్ని పెంచాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్, కార్డు హెల్త్ కార్డులు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.
కర్ణాటక, మహారాష్ట్రలో మాదిరి జర్నలిస్టులకు రాష్ట్రం మొత్తం మొత్తం పర్యటించేలా బస్‌పాసులను అందించాలని,
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పని చేసే ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం లేదంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ ఆ కుటుంబానికి నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు పడ్డ బాధలు వర్ణనాతీతమని అన్నారు. వృత్తి ధర్మంలో పార్టీలకు అతీతంగా జర్నలిస్టుల పని చేయాలే తప్ప ఏ ఒక్క పార్టీ మెప్పు పొందడానికి పని చేయవద్దని సూచించారు.కరోనా మహమ్మారి వ్యాధి మూలంగా జర్నలిస్టులు ప్రాణాలు వదిలినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మంచి చెడులను ప్రజల ముందుంచుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాస్, జర్నలిస్టులు లకావత్ యాదగిరి నాయక్, గిరికత్తుల శ్రీనివాస్ గౌడ్, ఆడెం కృష్ణ,కొయ్యడ సాంబశివ, సిహెచ్ రాము, నల్లపు రాజు, ఎనగందుల సంతోష్, పంజాల శ్రీకాంత్, మెరుగు రమేష్,పల్లె ఏకాంతం, శ్రీకాంత్ గౌడ్, చిలకమారి భాస్కర్, సుధా గాని సుధాకర్, చీకటి వీరన్న,కిలి శెట్టి శంకర్, ప్రవీణ్,బి. కృష్ణ, నిమ్మల రవి, బంధు మహేందర్, రామ్మూర్తి,రెడ్డ బోయిన దిలీప్, సోమేశ్,గూడెల్లి యాకయ్య, కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.