జర్నలిస్టు ఎలక సైదులు గౌడ్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

హుజూర్ నగర్ పట్టణంలో ఆదివారం టౌన్ హాల్ లో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశానికి హాజరైన స్టార్ 9 సీనియర్ జర్నలిస్ట్ ఎలక సైదులు గౌడ్ పై దాడి చేసి గాయపరిచిన నిందితులను కఠినంగా శిక్షించాలని మునగాల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గాయం శ్రీనివాస రెడ్డి సోమవారం ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. .జర్నలిస్టులు రాసిన వార్తల్లో వాస్తవం లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప భౌతికంగా దాడులకు దిగడం సరైన విధానం కాదన్నారు. గతంలో కూడా హుజూర్ నగర్ లో గత 20 సంవత్సరాల పైబడి జర్నలిస్టుగా కొనసాగుతున్న సైదులు గౌడ్ పై రెండుసార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారని, మరల మరొకసారి ఈ ఆదివారం హత్యాయత్నానికి పాల్పడ్డారని…. గతంలోనే సైదులు గౌడ్ ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు తెలిపాడని కానీ నేటి వరకు ఏటువంటి చర్యలు తీసుకో లేకపోవటం నిజంగా దురదృష్టకరం. కావున ప్రభుత్వం ఇలాంటి దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ మీడియా ప్రతినిధుల రక్షణకై కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు.నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు ప్రభుత్వం భరోసాగా నిలవాలని అభిప్రాయపడ్డారు.జర్నలిస్టులపై దాడిచేసే వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలన్నారు.నిజాయితీగా నిక్కచ్చిగా వార్తలు రాస్తున్న విలేకరులపై తెలంగాణ రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయని అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.