జర్నలిస్ట్ ల సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుంది అని జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం అధ్యక్షులు బైరి భరత్ కుమార్ అన్నారు. శనివారం జఫర్గడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..నేటి జర్నలిస్ట్ సామజిక స్పృహలో మరియు ప్రజల శ్రేయస్సు కొరకు పోరాడుతున్నారు అని అన్నారు.అదేవిధంగా అగ్రిడిడేషన్ కార్డును ఆసరాగా చేసుకొని ఆయా పత్రికలు మండల జర్నలిస్ట్ లను ఇబ్బందులు గురి చేయడం సబబు కాదని ఇలా ఇబ్బందులు గురి చేస్తే టీజేఏ తరుపున మండల జర్నలిస్టులకు మద్దతుగా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా అధ్యక్షులు నీల నరేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దూరి సోమశేకర్, జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.