జల్సాల కోసం హత్య చేసిన నిందితుడి అరెస్టు

ఎట్టకేలకు హత్య కేసును ఛేదించిన పాలకుర్తి పోలీసులు

పాలకుర్తి మండలం రాఘవపురం బస్టాప్ వద్ద జరిగిన హత్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని పాలకుర్తి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి ఒక కారు, నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ ఫోన్లు మరియు రెండు పెప్పర్ స్పెరే బాటిళ్ళలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ గత నెల 23వ తేది ఆర్థరాత్రి పాలకుర్తి మండలం రాఘవపురం బస్ పేజీ వద్ద హత్య జరిగినట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు నేరస్థలాన్ని సందర్శించి మృతుడు మడత నర్సింహ, తండ్రి నర్సయ్య వయస్సు 47,కుమార్ వల్లి, హన్మకొండ చెందిన వాడు ప్రస్తుతం హైదరాబాద్ ఎల్.బి నగర్‌లో నివాసం వుంటూ స్వంతంగా ఒక కారు కొనుగోలు చేసి తానే డ్రైవర్‌గా వుంటూ కారును కిరాయికి నడిపేవాడని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. వెస్ట్ జోన్ డి.సి.పి శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు పాలకుర్తి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ నేతృత్వంలో ఈ హత్యకేసులో దర్యాప్తు చేపట్టి పోలీసులకు అందుబాటులో వున్న అధునికి పరిజ్ఞానాన్ని వినియోగించుకోని పోలీసులు జరిగిన హత్యకు పాల్పడింది. పాలకుర్తి మండల కేంద్రంలో కేబుల్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న పరాంకుశం రోషన్, తండ్రి పేరు ఉగేందర్‌స్వామి, వయస్సు 20 పాల్పడినట్లుగా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా,
నిందితుడు పరాంకుశం రోషన్ తండ్రి పాలకుర్తి మండల కేంద్రంలో కేబుల్ నెట్వర్క్ ద్వారా నిర్వహించడంతో వచ్చే ఆదాయంతో నిందితుడు జల్సాలకు పాల్పడేవాడు. తన జల్సాల కోసం అవసమరయిన డబ్బును సులభంగా సంపాదించాలనే లక్ష్యంతో 2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పాలకుర్తి మండల కేంద్రంలో నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిలో రెండు వాహనాలు అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడంతో పాటు మిగితా రెండు వాహనాలను తాను వినియోగించుకోవడంతో పాటు గత కొద్ది రోజుల క్రితం నిందితుడు దంతాలపల్లి ప్రాంతంలోను ఒక ద్వీచక్రవాహన చోరీ పాల్పడటం జరిగింది. నిందితుడు చోరీ చేసిన వాహనాల నంబర్ ప్లేట్ కు ఓలేక్స్ లో అమ్మకానికి ఉంచిన ద్వీచక్రవాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ను వ్రాయించేవాడు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుండి నిందితుడి తండ్రికి కంటిచూపు సన్నగిల్లడంతో నిందితుడు పరాంకుశం రోషన్ కేబుల్ నెట్వర్క్ పర్యవేక్షించడం ప్రారంభించాడు. ఇలా కేబుల్ వ్యాపారం ద్వారా ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు కారును కిరాయికి మాట్లాడుకోని మార్గం మద్యం డ్రైవర్‌ను చంపి కారును చోరీ చేసిన దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నిందితుడు టివిలో ప్రసారమయ్యే ఒక తెలుగు సీరియల్ నందు చూపించినట్లుగా ముందుగా నిందితుడు ఆన్లైన్ ద్వారా రెండు పెప్పర్ స్పేరేలను కొనుగోలు చేశాడు. వీటిని తీసుకోని నిందితుడు దంతాలపల్లిలో చోరీ చేసిన వాహనంపై గత నెల 23 తేదీన సాయంత్రం హన్మకొండ ప్రాంతానికి చేరుకోని ఒంటరిగా ఉన్న కారు డ్రైవర్లపై దృష్టి సారించాడు నిందితుడు. ఈ క్రమంలో నిట్ కళాశాల ప్రాంతంలో ప్రయాణికుల కోసం కారుతో ఎదురుచూస్తున్న మృతుడు నర్సింహతో నిందితుడు కంప్యూటర్ మదర్ బోర్డు ఇచ్చేందుకు జనగాం వెళ్ళాసి వుందని కారును కిరాయి కుదుర్చుకోని తన ద్విచక్ర వాహనాన్ని వడ్డేపల్లి క్రాస్ వద్ద వున్న కేబుల్ టివి కార్యాలయములో వుంచి నిందితుడు మృతుడితో కల్సి కారులో రాత్రి 8.30 గంటలకు జనగామకు కారులో బయలుదేరి వెళ్లాడు. జనగాంకు కారులో చేరుకున్న నిందితుడు కారు డ్రైవరయిన మృతుడిని తప్పుదోవ పట్టించేందుకుగాను జనగామ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆగి పనికాలేదు అన్నట్లుగా తిరిగి వచ్చి కారులో ఎక్కేవాడు. ఇదే సమయంలో నిందితుడు మద్యం దుకాణంలో మద్యం సేవించడంతో పాటు మద్యం బాటిల్ కోనుగోలు చేసుకోని. కంప్యూటర్ మదర్ బోర్డు మరమ్మత్తు నిమిత్తం పాలకుర్తి పోవాల్సి వుందని. నిందితుడు కారులో తిరిగి పాలకుర్తికి ప్రయాణించేను జనగామ పాలకుర్తి మార్గమధ్యంలో మృతుడిని హత్య చేసేందుకు సరైయిన ఆవకాశం రాకపోవడంతో నిందితుడు తన మిత్రుడి ఇంటిలో పనివుండని మృతుడికి చెప్పి కారులో తన ఇంటికే వెళ్ళి ఇంటిలో కొద్దిసేపు గడిపి అనంతరం కారులో తిరిగి హన్మకొండ బయలుదేరాల్సిందిగా తెలిపి హన్మకొండ వస్తున్న క్రమంలో నిందితుడు రాఘవపురం గ్రామ శివారులో ప్రాంతంలోని బస్టాప్ వద్ద మూత్ర విసర్జన చేసుకోనే సాకుతో నిందితుడు కారు నుండి దిగి మూత్ర విసర్జన అనంతరం కారులో కూర్చోకోని వున్న మృతుడిపై నిందితుడు పెప్పర్ స్పేరేతో స్పేరే చేయడంతో నిర్ఘాంతపోయిన మృతుడు నిందితుడిపై తిరిగపడటంతో నిందితుడు మృతుడిపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు పలుమార్లు పెప్పర్ స్పేరేను స్పెరే చేయడం ద్వారా బస్టాప్ ప్రక్కనే వున్న నీటికాలువలో మృతుడు పడిపోవడంతో నిందితుడు భారీగా వున్న మట్టిగడ్డలతో పాటు బండరాయితో మృతుడిపై మోపడంతో మృతుడు నర్సింహ సంఘటన స్థలంలో మరణించాడు. మృతుడు మరణించిన అనంతరం నిందితుడు మృతుడి కారుని తీసుకోని రోడ్డు మార్గంలోని సిసి కెమెరాలకు చిక్కకుండా మరో మార్గం కుండా తన ఇంటికి చేరుకొని ఇంటికి దూరం కారును నిలిపి తన రక్తం మరకలు, పెప్పర్ స్పెరే బాటిళ్ళను తన ఇంటి వెనుక భాగం లో భద్రపర్చిచాడని నిందితుడు పోలీసుల విచారణ అంగీకరించాడని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ హత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, సిసి కెమెరాల దృష్యాల ఆధారంగా నిందితుడుని గుర్తించిన పోలీసులు ఈ రోజు ఉదయం నిందితుడు తాను గతంలో చోరీ చేసిన వాహనంపై వస్తున్నట్లుగా సమాచారం రావడంతో పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేరాలు, సబ్-ఇన్స్ స్పెక్టర్ సతీష్ తమ కల్సి పాలకుర్తి శివారు ప్రాంతం నుండి వాహనంపై వస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు నిందితుడు ఇచ్చిన సమాచారంతో హత్యకు వినియోగించిన పెప్పర్ స్పెరే బాటిళ్ళు, మృతుడి సెల్ ఫోన్తో పాటు చోరీ చేసిన ద్వీచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యులు లేకున్న పాలకుర్తి పోలీసులతో పాటు ఐటీకోర్ విభాగం, సైబర్ క్రైం పోలీసులు అధునిక పద్ధతులతో ప్రస్తుతం పోలీసుల వద్ద అందుబాటులో వున్న టెక్నాలజీ వినియోగించుకోవడంతో పాటు సిసి కెమెరాల్లో నమోదయిన దృష్యాల ఆధారంగా హత్యకు పాల్పడిన నిందితుడుని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం జరిగింది

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డి.సి.పి శ్రీనివాస్ రెడ్డి, వర్ణన్నపేట ఎ.సి.పి రమేష్, పాలకుర్తి ఇన్ స్పెక్టర్ చేరాలు, ఐటీ మరియు సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్లు రాఘవేందర్, జనార్ధన్ రెడ్డి, పాలకుర్తి ఎస్.ఐ సతీష్, అసిస్టెంట్ ఆనాటికల్ ఆఫీసర్ సల్మాన్, దేవరుప్పుల, కొడకండ్ల ఎస్.ఐలు కరుణాకర్ రావు, పవన కుమార్తో పాటు పాలకుర్తి, సైబర్ క్రైం సిబ్బందిని పోలీసు కమిషనర్ అభినందించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.