#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

గిరిజన సంస్కృతిని కాపాడుతాం .

👉 గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్.

👉 గిరిజన తండాలను గ్రామ పంచాయతీ గా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం దే.

👉 బంజారా భవన నిర్మాణానికి సహకారం అందిస్తా .

👉 జనాభా లెక్కలో కూడా లేని 35 కులాల నుటిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది .

👉 అన్ని మతాల ,కులాల సంస్కృతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది .

👉 ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

గిరిజన జాతి ప్రయోజనాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంత్ సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ….. సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్యదైవం అని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడ నిర్వహించడం లేదని ఆయన అన్నారు. 300 సంవత్సరాల క్రితమే మనం ఎలా జీవించాలో చెప్పిన గొప్ప మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా లకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కిందన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేఅన్నారు. నడిచి కూడా వెళ్ల లేని స్థితిలో లో ఉన్న తండా లకు నేడు సిసి రోడ్లు, డ్రైనేజీ లు మంచి నీటి వసతి ,విద్యుత్తు ,విద్యా వసతులు కల్పించి అభివృద్ధి చేసిందన్నారు. ఆ తండా లకు గిరిజన బిడ్డలే ప్రజా ప్రతినిధులు గా ఉంటూ రాజ్యాధికారం లో భాగ స్వాములయ్యారన్నా రు.పూట గడవని స్థితిలో గంజి తాగి బతికే గిరిజన బిడ్డల కోసం నేడు ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య తో పాటు అన్ని పోషక విలువలు కలిగిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.గిరిజన బిడ్డ ల వివాహాలకు కళ్యాణ లక్ష్మీ పదకం తో పాటు మిగతా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గిరిజనుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు నిరంతరాయంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ గిరిజనుల్లో చైతన్యం తీసుకు వచ్చింది అన్నారు. గిరిజనులకు సేవాలాల్ జయంతి ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ విందులు, హిందువులకు బతుకమ్మ పండుగకు చీరలు క్రైస్తవులకు క్రిస్మస్ కు విందులు గిఫ్టు ప్యాక్ లు అందిస్తూ ప్రభుత్వం అన్ని కులాల మతాల విశ్వాసాలకు అండగా నిలబడుతుంది అన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను కూడా సాధించి తీరుతాం అన్నారు. కోదాడ పట్టణంలో బంజారా భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను గిరిజనులు భారీగా సన్మానించారు. గిరిజనుల తలపాగా చుట్టుకొని ఎమ్మెల్యే ప్రారంభోపన్యాసం లో రామ్ రామ్ అంటూ అభివాదం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యేలను ర్యాలీతో వేదిక వద్ద కు ఘనస్వాగతం పలుకుతూ తీసుకొచ్చారు . ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీలు చింతా కవిత రాధా రెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, జెడ్ టి సి ఉమా శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ లు శర్మ, మండల విద్యాధికారి సలీమ్ షరీఫ్, సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు హాజీ నాయక్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస నాయక్, మాజీ జెడ్పిటిసి శివాజీ నాయక్, మాలోత్ సైదా నాయక్, చరణ్ నాయక్, రాజు నాయక్, గిరిజన నాయకులు సైదా నాయక్, నాయక్, లచ్చి రామ్ నాయక్ ,హనుమానాయక్ స్వామి నాయక్, ,రవి నాయక్, రఘు నాయక్, ఇందిరా, గోపి, రాము శ్రీరామ్, దేవల,టిఆర్ఎస్ నాయకులు చందు నాగేశ్వరరావు ఈదుల కృష్ణయ్య సుఖ్య నాయక్ పలువురు గ్రామాల గిరిజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.