జాతీయ సెమినార్ ను జయప్రదం చేయండి గిరిజనుల అభివృద్ధి- సవాళ్లు

గిరిజనుల అభివృద్ధి సవాళ్లు అనే అంశంపై నిర్వహించనున్న జాతీయ సెమినార్ జయప్రదం చేయాలని ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ అనుబంధ సంఘం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ……..
75 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈ ఏడాది ఘనంగా జరుపుకుంటున్నాము. దేశం అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందని చెపుతున్నాప్పటికి ఆదిమ తెగలైన గిరిజన తెగల అభివృద్ధి మాత్రం మరింత దిగజారింది. 2021 ఐక్యరాజ్యసమితి నివేదిక అందుకు నిదర్శనం. దేశంలో కరోనా తరువాత గిరిజన తెగల్లో ఆకలిచావులతో పాటు కోట్లాది మంది మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారని తెలిపింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారంటే. పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది.
దేశంలో 15 కోట్ల మంది గిరిజనులున్నారు. గ్రామాలు, పట్టణాలకు దూరంగా విసిరేసినట్టు అడవులు, కొండల్లో నివశిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 75 ఏళ్ళ కాలంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు చేశామని చెపుతున్నా ఆశించిన ఫలితాలు సాధించలేదు. నేటికీ వేలాది గిరిజన గూడేలు, తండాలకు కరెంటు, రోడ్లు, మంచినీరు వంటి కనీస సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. విద్య, వైద్యం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి లేక కోట్లాది మంది గిరిజనులు పొట్టకూటికోసం పట్టణాలకు వలసలు వెళుతున్నారు. కరోనా లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు పడినవారిలో గిరిజనులే గణనీయంగా ఉన్నారు. భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు గిరిజనులను మరింత వెనుకబాటుకు గురిచేస్తున్నాయి. భారీ, పరిశ్రమలు,ప్రాజెక్టుల పేరుతో లక్షలాది మంది గిరిజనులు నిరాశ్రయులవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజ, అటవీ సంపదను బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. దీనితో గిరిజనులమనుగడ కొనసాగించలేక అనేక గిరిజన తెగలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి సహితం గిరిజన హక్కులను కాపాడాలని ఆగష్టు 9న ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది.
ఇటువంటి తరుణంలో 75 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా “గిరిజనుల అభివృద్ధి సవాళ్ళు ” అనే అంశంపై 2022 సెప్టెంబర్ 2-5 వరకు నాలుగు రోజులపాటు వివిధ అంశాలపై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నాము. 23 రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులు, గిరిజన ఉద్యమ కారులు, మేధావులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు హాజరవుతున్నారు. కావున ఈ సెమినార్ జయప్రదం చేయాని గిరిజన ప్రజలకు కోరుతున్నాము.ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రమావత్ మీట్యా నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ తేజావత్ గణేష్ నాయక్ లావుడా అనిల్ చౌహన్ జిల్లా నాయకులు ఇస్లావత్ ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.