జికెఆర్ సంస్థ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

పది నెలల నుండి వేతనాలు చెల్లించాలని జికెఆర్ కాంట్రాక్టు రద్దు చేయాలి.సిఐటియు DCL కు ఫిర్యాధు. మిషన్ భగీరథ జీకేఅర్ సంస్థ పది నెలల నుండి కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, ఈ సంస్థ పై క్రిమినల్ కేసులు వెంటనే పెట్టాలని ,కాంట్రాక్టు లైసెన్స్ వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు .
ఈ రోజు డి సి ఎల్ రవీందర్ రెడ్డి కి సిఐటియు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది, జీకేఅర్ సంస్థ కార్మికులకు పది నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా కార్మికులను నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు, మిషన్ భగీరథ స్కీము లో కార్మిక చట్టాలు అమలు కావడం లేదని అన్నారు, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, యూనిఫామ్, బూట్లు ఇవ్వడం లేదని అన్నారు, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మయ్య, మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.