సూర్యాపేట జిల్లాలో టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎన్నికల వేడిని రగిల్చారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 2023 శాసనసభ ఎన్నికల కు కు రెండు నియోజక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు సూర్యాపేట నియోజకవర్గానికి ప్రముఖ న్యాయవాది తెలంగాణ ఉద్యమకారుడు కుంట్ల ధర్మార్జును హుజూర్నగర్ నియోజకవర్గానికి గండేపల్లి మండలానికి చెందిన దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లను ప్రకటించి రాజకీయ కాకను రగిలించారు సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మొదటినుంచి పార్టీకి కోదండరామ్ కు వెన్నుదన్నుగా నిలబడిన కుంట్ల ధర్మార్జును ఎంపిక అందరూ ఊహించిందే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో సూర్యాపేటలో ఉద్యమాన్ని పతాకస్థాయిలో తీసుక పోవడంలో ధర్మార్జునుపాత్ర కీలకమనే చెప్పుకోవాలి నాటి పాలకులకు వ్యతిరేకంగా ధర్నాలు శాంతి నిరసనలు సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ ఏ కార్యక్రమం తలపెట్టినా ధర్మ అర్జున్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు2014 లో జరిగిన ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి లోపాయికారి కంగా పని చేసి టిఆర్ఎస్ అభ్యర్థి విజయంలో పాలుపంచుకున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ విభేదాల కారణంగా ధర్మ అర్జున్ కోదండరాం తో కలిసి నడిచాడు టీజేఎస్ లో కీలక నాయకుడిగా ఎదిగాడు
T J S పార్టీ 2018 ఏప్రిల్ 29 న పురుడు పోసుకుంది 2018 డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ ఎన్నికల పొత్తులో భాగంగా గా సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి టీజేఎస్ మద్దతు ఇచ్చింది ఆ తర్వాత జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టీజేఎస్ పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి
ఈసారి పొత్తులపై నిరాసక్తి
శాసనసభ ఎన్నికల ముందు హడావుడిగా అభ్యర్థులను ప్రకటించడం కన్నా ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఫలితం రాబట్టవచ్చని కోదండరాం ముందు గా జిల్లాలో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు ఈసారి కాంగ్రెస్ తో పొత్తు ఉండదని సంకేతాలు ఇచ్చారు పొత్తుపై ఒక నాయకుడుని అడిగిన ప్రశ్నకు ఆ నాయకుడు సమాధానమిస్తూ కాంగ్రెస్ తో పొత్తు తాను బతకాలని కోరుకుంటూ అవతలి వారిని చనిపోవాలని విధంగా ఉంటుందని తేల్చి చెప్పారు ఎప్పటికీ తామే త్యాగాలు చేయవలసి వస్తుందని తమ కోసం వారు త్యాగం చేయరని ఆ నాయకుడు చెప్పుకొచ్చారు
ప్రజా వ్యతిరేక విధానాలు విపక్షాలకు కలిసివచ్చే నా
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తోంది 2014_2018 ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుండి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే అయితే ఈసారి గెలుపు తమదేనని ధీమాతో విపక్ష పార్టీల అభ్యర్థులు ఉన్నారు దేశంలో ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు సులువు కాదనే భావన లో లో ఉన్నారు అదే తరహాలో సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి గెలుపు కూడా కష్టతరంగా మారనుందని ప్రచారం మొదలైంది అయితే మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి మరోమారు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్ట ఉన్నారని బలమైన ప్రచారం కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది ఏది ఏమైనా రానున్న ఎన్నికలకు ముందే టీజేఎస్ అభ్యర్థులు ప్రకటించి రాజకీయ వేడిని పెంచడమే కాకుండా తాము ఎన్నికలకు సిద్ధమనే భావనను టీజేఎస్ ప్రజల ముంగిట తీసుకు వెళ్ళింది