జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు

జనగామ పట్టణంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించే వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి హెచ్చరించారు.

దివి: 29-03-2022 మంగళవారం రోజున మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల సాధన కమిటీ, సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి దీక్షలో కూర్చున్న లబ్ధిదారులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. అనంతరం మోకు కనకారెడ్డి మాట్లాడుతూ 2012-13లో జనగామ పట్టణంలో మూడవ విడతలో 1167 మందికి గత ప్రభుత్వం ఇండ్ల స్థలాల పట్టాలిచ్చారని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంకై ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అట్టి లబ్ధిదారుల స్థలాలను ఆక్రమించుకొవడంతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రమించడంతో ప్రభుత్వం దిగొచ్చి 560 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఒక సంవత్సరంలో పూర్తిచేసి అప్పగిస్తామని చెప్పి నేటికీ మూడు సంవత్సరాలు అయ్యిందని విమర్శించారు. ఇప్పటికి 250 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రమే ప్రారంభించడం జరిగిందని, కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించడంలేదని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పగుళ్లు, పర్రెలు, పెచ్చులు ఊడిపోవడం, నిర్మించిన గోడల ఇటుకలు పడిపోవడం వంటివి జరుగుతున్న కాంట్రాక్టర్ ఇండ్లను ఎప్పటికప్పుడు పరిశీలన చేయకపోవడం గమనిస్తుంటే సదరు కాంట్రాక్టర్ కు బిల్లులు తప్ప నిరుపేదల ఇండ్ల నాణ్యత ప్రమాణాలు అవసరం లేదనే నిర్లక్ష్యం అర్ధం అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించి పటిష్టమైన ఇండ్లను నిర్మించేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నిరుపేదలైన లబ్ధిదారులు నెలనెలా ఇండ్ల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బాధలను పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలని, కరోనా కాలంలో పనులులేక పస్తులుంటూ ఇంటి అద్దెలు చెల్లించాల్సిన దుస్థితి వచ్చిందని తక్షణమే ప్రభుత్వం నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లుల నిధుల విడుదలకు సహకారం చేసి త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఇర్రి అహల్య, బోట్ల శేఖర్, పట్టణ నాయకులు ఎం.డి. దస్తగిరి, జోగు ప్రకాష్, బాల్నే వెంకటమల్లయ్య, పల్లెర్ల లలిత, పందిళ్ళ కల్యాణి, కళ్యాణ లింగం, తూడి దేవదానం, కొండ వరలక్ష్మి, మూడవ విడత ఇండ్ల సాధన కమిటీ నాయకులు పొన్నాల ఉమ, ఎం.డి. గౌసియా, నజియా, శాంత, కమల, బాబూరావ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.